🠕

భారతదేశంలోని ఒక ముఖ్యమైన మరియు ప్రముఖ భూవిజ్ఞానశాస్త్ర పరిశోధనా సంస్థ అయిన సిఎస్ఐఆర్-జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (సిఎస్ఐఆర్-ఎన్ జి ఆర్ ఐ) కు నేను మిమ్మల్ని సంతోషంగా స్వాగతిస్తున్నాను, ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర వేదికలలో తన గుర్తింపుని కలిగి ఉంది. 1961 లో స్థాపించబడిన సిఎస్ఐఆర్-ఎన్ జి ఆర్ ఐ తన అంకితభావం కలిగిన శాస్త్రవేత్తలు  మరియు సహాయక సాంకేతిక సిబ్బంది యొక్క పరిశోధన మరియు ఆవిష్కరణల ద్వారా భారతదేశంలోని భూవిజ్ఞానశాస్త్ర రంగంలో చెరగని ముద్ర వేసింది. మా విజ్ఞానశాస్త్ర పరిశోధనలు సిఎస్ఐఆర్-ఎన్ జి ఆర్ ఐ వ్యవస్థాపక మిషన్ అయినటువంటి భూమి యొక్క నిర్మాణం, గతిశీలత మరియు వనరుల గురించిన పరిజ్ఞానం పై అవగాహనను - మరింత ముందుకు తీసుకువెళతాయి. ఇన్ని సంవత్సరాలుగా, ఈ సంస్థ ఆధునిక గణన మరియు విశ్లేషణాత్మక సౌకర్యాలను, అలాగే అత్యాధునిక క్షేత్ర భౌబౌతిక  పరికరాలను సంపాదించుకుంది. ఇది భూమి యొక్క అంతర్భాగాన్ని, ముఖ్యంగా భారత ఉపఖండాన్ని, అన్వేషించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలను రూపకల్పన చేయడానికి, పరికల్పనలను పరీక్షించడానికి మరియు వాటిని ధృవీకరించడానికి వీలు కల్పించింది.
నీరు, శక్తి మరియు ఖనిజాల కోసం పెరుగుతున్న డిమాండ్ కి ప్రతిగా నిరంతరం తరిగిపోతున్న లభ్యత కారణంగా తలెత్తిన సంక్షోభం, భూవిపత్తులు మరియు సంభావ్య ఉపద్రవాల గురించి పెరుగుతున్న ఆందోళన, ఇవన్నీ సహజంగానే భూవిజ్ఞానశాస్త్ర పరిశోధనలను మానవ అన్వేషణలో ముందు వరుసలో నిలబెడతాయి. నీరు, శక్తి మరియు భౌమ విపత్తుల సవాళ్లను పరిష్కరించడానికి మౌలిక మరియు అంతర్-శాఖీయ భూవిజ్ఞానశాస్త్ర అన్వేషణ చేయడం ద్వారా నిర్విరామంగా ప్రయత్నాలు చేయటానికి మేము కట్టుబడి ఉన్నాము. విజ్ఞానశాస్త్ర సవాళ్లను సాధించటానికి, మేము పరిశోధకుడి ఆధారిత విజ్ఞానశాస్త్రం నుండి మిషన్ మోడ్ ప్రాజెక్టుల విధానంలోకి మారటం మొదలుపెట్టాం, ఇవి ప్రేరిత పరిశోధనా విధానంపై ఆధారపడి ఉంటాయి, అనగా మౌలికమైన విజ్ఞానశాస్త్ర  సమస్యలకు సమాధానం వెతకటం, మరియు సమాజానికి తక్షణ ఉపయోగం కోసం ఉద్దేశించిన విజ్ఞానశాస్త్ర పరిష్కారాలను కనుగొనడం.
ఏ రూపంలోని పరిజ్ఞానాన్నైనా నగదుగా మార్చడం అనేది సిఎస్ఐఆర్ చేత నాలుగు వర్గాలలో గుర్తించబడింది; ప్రభుత్వేతర, వ్యూహాత్మక, ప్రజ, మరియు సామాజిక ఉపకరణాలు, వీటి వాస్తవ వాణిజ్య వసూలుకు సమయం గణనీయంగా పట్టినప్పటికీ, ఇవి దేశం యొక్క అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. శాస్త్రవేత్తలు, పరిశోధనా విద్యార్థులు, సాంకేతిక మరియు సహాయక సిబ్బంది యొక్క శక్తివంతమైన బృందంతో కలిసి, ప్రపంచ భూవిజ్ఞానశాస్త్ర సమస్యలను పరిష్కరించటంలో మరియు అనివార్యంగా జాతీయ అవసరాలకు అనుగుణంగా ఉండే సిఎస్ఐఆర్ యొక్క అంచనాలను మేము అందుకుంటామని నేను విశ్వసిస్తున్నాను.